ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని గురుద్వారా రకబ్ గంజ్ సాహిబ్‌ను ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సిక్కు మత బోధకుడు గురు తేజ్ బహదూర్‌కు నివాళులు అర్పించి ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పంజాబ్ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తోన్న నేపథ్యంలో ప్రధాని మోడీ గురుద్వారా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది . ప్రధాని పర్యటనలో భాగంగా ఎలాంటి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదని, ట్రాఫిక్‌ను కూడా నిలిపివేయలేదని అధికార వర్గాలుపేర్కొన్నాయి. ఈ పర్యటన ప్రధాని షెడ్యూల్లో లేదని తెలిపాయి.