బిగ్​బాస్​ విన్నర్​ శాతం తనకే ఎక్కువ

బిగ్​బాస్​ విన్నర్​ శాతం తనకే ఎక్కువహైదరాబాద్​ : బిగ్​బాస్​ నాలుగో సీజన్​ కథ క్లైమాక్స్​కు వచ్చింది. విన్నర్​ ఎవరు ? రన్నర్​ ఎవరు? కొన్ని గంటల్లో బిగ్​బాస్​ ప్రకటించనున్నారు. ఈ సీజన్​లో ఊహించని ఎలిమినేషన్లు ఇచ్చి ట్విస్ట్​ ఇచ్చిన బిగ్​బాస్​ విజేతను ప్రకటించే విషయంలో ఏ విధమైన ట్విస్టు ఇవ్వనున్నాడోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సుదీర్ఘంగా సాగనున్న ఈ గ్రాండ్​ ఫినాలే షూటింగ్​ శనివారమే ముగిసింది. నేడు విజేతను ప్రకటించే అసలైన ఘట్టం చిత్రీకరణ చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్​లుగా ఎవరు వస్తున్నారనేది మాత్రం సస్పెన్స్​గా పెట్టారు. ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్​ అయినట్లు సామాజిక మాధ్యమాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చివరి వీక్​లో హారికకు తక్కువ ఓట్లు వచ్చి ఐదో స్థానంలో నిలిచిందని సోషల్​ మీడియాలో వినిపిస్తోంది. తర్వాత హౌస్​లో అరియానా, సోహైల్​, అభిజిత్​, అఖిల్​ ఉన్నారు. అయితే హారిక తరువాత అరియానాకు కూడా తక్కువ ఓట్లు పడ్డాయని సమాచారం. దీంతో నాలుగో స్థానంలో ఉన్న ఆమె ఎలిమినేట్​ అయినట్లు వినికిడి. హారిక వెళ్లినంక మిగిలిన నలుగురు కంటెస్టెంట్లకు నాగార్జున రూ.10 లక్షలు ఆఫర్​ ప్రకటించారని కానీ వాళ్లు దాన్ని తిరస్కరించడంతో ఓట్ల లెక్కల ప్రకారం అరియానాను పంపించేశారని మరో వార్త సోషల్​ మీడియాలో హాట్​ హాట్​గా వినిపిస్తుంది. అయితే నిజంగా అరియానా నాలుగోస్థానం దగ్గరే ఆగిపోయి టైటిల్​ రేసు నుంచి తప్పుకుందా? లేదా? సోహైల్​, అభిజిత్​, అఖిల్​లో ఎవరు విన్నర్​ , ఎవరు రన్నర్​ అనేది కాసేపట్లో తెల్వనుంది. అయితే ఇక విన్నర్​ ,రన్నర్ విషయం గురించి మాట్లాడుకుంటే అభిజిత్,​ సోహైల్​, అరియానా , అఖిల్​ ఈ నలుగురు హౌస్​లో ఒకరికి మించి ఒకరు బిగ్​బాస్​ విన్​ కావడానికి పోటీపడుతున్నారు. అయితే ముఖ్యంగా ఓటింగ్​ విషయానికొస్తే ఎక్కువశాతం అభిజిత్​కు ఉంది కనుక తనే విన్నర్​ అవుతాడని సోషల్​ మీడియా కోడై కూస్తోంది. వాస్తవంగా చూసుకుంటే అభిజిత్ వైపే​ అభిమానుల గాలి వీస్తుండడంతో తన గెలుపుఖాయమనిపిస్తుంది. ఇక రెండో స్థానంలో సోహైల్ ,అఖిల్​ పోటీపడుతున్నారు. ఇక అరియానాకు అభిమానులు ఓటింగ్​లో నాలుగో స్థానం కల్పించారు. అదృష్టం బాగుంటే అరియానా రన్నరప్​గా గెలిచే అవకాశాలు ఉన్నాయని అభిమానులు అంటున్నారు. మరి కొన్ని గంటల్లో బిగ్​బాస్​ విన్నరెవరో ఫలితాలు తెలియనుండడంతో అభిమానులు ఉత్కంఠభరితంగా టీవీలు, సెల్​ఫోన్లకు అతుక్కుపోయారు. బిగ్​బాస్​లోని ఆ నలుగురి కోసం వారి వారి అభిమానులు గెలువాలంటూ కోరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ మరీ కొద్ది గంటల్లో బిగ్​బాస్​ రన్నరెవరో విన్నరెవరో తేలిపోనుంది. బిగ్​బాస్​లో విన్నర్​ కోసం పోటీపడుతున్న అరియానా ,అభిజిత్​ , సోహైల్​, అఖిల్​కు వరంగల్​ టైమ్స్​(warangaltimes)తరుపున ఆల్​ది బెస్ట్​.