హైదరాబాద్ : ట్రైబల్, బీసీ వెల్ఫేర్, సాంఘీక సంక్షేమ హాస్టళ్లలో 2020-21 విద్యాసంవత్సరానికి గానూ ఐదవ తరగతిలో ప్రవేశాల కోసం రిపోర్టింగ్ గడువును డిసెంబర్ 28 వరకు పొడిగించినట్లు వీటీజీసెట్ కన్వీనర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఫేజ్-1లో ఎంపికైన విద్యార్థులు 19 లోగా రిపోర్ట్ చేయాల్సి వుండగా, తాజాగా ఆ గడువును 28 వరకు పొడిగించినట్లు చెప్పారు. సంబంధిత ధ్రువపత్రాలతో గురుకుల పాఠశాలలో రిపోర్టు చేయాలని తెలిపారు. లేదంటే అడ్మిషన్ రద్దు చేసి, ఆ సీట్లను ఇతరులతో భర్తీ చేస్తామని తెలిపారు. వివరాలకు వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.