లాంచీలను పున‌రుద్ధరించాలి

లాంచీలను పున‌రుద్ధరించాలిగుంటూరు జిల్లా : ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండకు విజయపురిసౌత్ లోని లాంచీ స్టేషన్ నుంచి లాంచీ సర్వీసులను నడుపాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్ జాస్తి వీరాంజనేయులు కోరారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో అదనపు కార్యదర్శి, ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డికి శనివారం వినతిపత్రం అందజేశారు. గత 8 నెలలుగా నాగార్జునకొండకు లాంచీ సర్వీసులు నడపకపోవడంతో ప్రజలు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అక్కడ మ్యూజియం, మాన్యు మెంట్స్, గార్డెన్ సిబ్బంది విధులకు వెళ్లలేకపోవడంతో కొండలో చెట్లు, చేమలు పెరిగిపోయి అస్తవ్యస్తంగా తయారైందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ధనుంజయరెడ్డి త్వరలో లాం చీల పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వీరాంజనేయులు తెలిపారు.