డబ్ల్యూటీఏ-500 డబుల్స్ లో సానియా జోడి ఓటమి

డబ్ల్యూటీఏ-500 డబుల్స్ లో సానియా జోడి ఓటమివరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : దుబాయ్ చాంపియన్ షిప్ డబుల్స్ సెమీస్ లో భారత టెన్సిస్ స్టార్ సానియా మీర్జా పరాజయం పాలైంది. శుక్రవారం రాత్రి జరిగిన డబ్ల్యూటీఏ-500 మహిళల డబు ల్స్ పోరులో సానియా-లూసీ హ్రెడెకా ( చెక్ రిపబ్లిక్ ) జోడీ 6-2, 2-6, 7-10తో లియుడ్ మైలా కిచెనోక్ (ఉక్రెయిన్ )-జెలెనా ఒస్టపెంకొ ( లాత్వియా) ద్వయం చేతిలో ఓడింది. తొలిసెట్ లో విజయం సాధించిన సానియా జంట, ఆ తర్వాత వరుసగా రెండు సెట్ లో చేజార్చుకుంది. 7 ఏస్ లు సంధించినా, నెట్ గేమ్ తప్పిదాల వల్ల సానియా జోడీకి పరాజయం తప్పలేదు.