ముంబైకి తెలంగాణ సీఎం కేసీఆర్

ముంబైకి తెలంగాణ సీఎం కేసీఆర్వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆదివారం ముంబైకి వెళ్ల‌నున్నారు. ఉద‌యం 11 గంట‌ల‌కు హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో ముంబైకి వెళ్ల‌నున్నారు. ఒంటి గంట‌కు మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ థాక్రేతో ఆయ‌న నివాసం ‘వ‌ర్ష’లో స‌మావేశం కానున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఆయ‌న వెంటే వెళ్లే టీంకు ఉద్ద‌వ్ థాక్రే భోజ‌నానికి ఆహ్వానించిన విష‌యం తెల్సిందే. వ‌ర్షాలోనే భోజ‌నం చేయ‌నున్నారు. భోజ‌నం, చ‌ర్చ‌ల అనంత‌ర ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ నివాసానికి వెళ్ల‌నున్నారు. జాతీయ రాజ‌కీయ అంశాల‌పై ఈ సంద‌ర్భంగా చ‌ర్చించ‌నున్నారు. తిరిగి ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్‌కు వ‌స్తారు.