బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ 

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI)వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత కల్గిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 10 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 696 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఇందులో క్రెడిట్ ఆఫీసర్, క్రెడిట్ అనలిస్ట్, ఐటీ ఆఫీసర్, సీనియర్ మేనేజర్ వంటి పోస్టులున్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ 

మొత్తం పోస్టులు : 696
ఇందులో క్రెడిట్ ఆఫీసర్ 484, క్రెడిట్ అనలిస్ట్ 53, ఐటీ ఆఫీసర్ 42, సీనియర్ మేనేజర్ ఐటీ 29, సీనియర్ మేనేజర్ 15, మేనేజర్ ఐటీ 27, మేనేజర్ 31, ఎకనమిస్ట్ 2, స్టాటిస్టీషియన్ 2, రిస్క్ మేనేజర్ 2, టెక్ అప్రైజల్ 9 చొప్పున ఉన్నాయి.
అర్హతలు : సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, పీజీ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ : రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్
దరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ లో
అప్లికేషన్ ఫీజు : రూ. 850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175
దరఖాస్తులకు చివరి తేదీ : మే 10
వెబ్ సైట్ : www.bankofindia.co.in