ఎక్సైజ్, రవాణా శాఖలో 677 పోస్టులు 

ఎక్సైజ్, రవాణా శాఖలో 677 పోస్టులు

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : రాష్ట్రంలోని ఉద్యోగార్థులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. మొన్న కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల భర్తీకి, నిన్న గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. తాజాగా ఎక్సైజ్, రవాణా శాఖలో 677 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్ (హెచ్ఓ) 6 పోస్టులు, ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్ (ఎల్ సీ) 57 పోస్టులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ 614 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థుల నుంచి మే 2 నుంచి 20 వరకు ఆన్లైన్ లో అప్లికేషన్లను స్వీకరించనున్నారు. తదితర వివరాల కోసం www.tslprb.inవెబ్ సైట్ ను సంప్రదించొచ్చు.