ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం 

ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈదురుగాలులకు మంటలు వ్యాపించి సుమారు 40 ఇండ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని శనగకుంటలో గురువారం సాయంత్రం జరిగింది. ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం ఈదురుగాలుల వల్ల అటవీ ప్రాంతం నుంచి గ్రామానికి మంటలు వ్యాపించాయి. దీంతో గ్రామంలోని 40 ఇండ్లు కాలిబూడిదయ్యాయి. దీంతో ఇళ్లల్లో ఉన్న గిరిజనులు బయటకు పరుగులు తీశారు.