బీహెచ్ఎంఎస్ యాజమాన్య కోటాకు మరో ఛాన్స్ 

బీహెచ్ఎంఎస్ యాజమాన్య కోటాకు మరో ఛాన్స్

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : రాష్ట్రం లోని ప్రైవేట్ హోమియోపతి కళాశాలలోని యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నేడు ఒక ప్రకటన విడుదల చేసింది. నీట్ -2022 అర్హత సాధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులు మార్చి 2సాయంత్రం 4 గంటల వరకు ఆన్లైన్ లో ఈ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి .మెరిట్ జాబితాను యూనివర్సిటీ వెబ్ సైట్ లో పొందుపరుస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సీట్ల కేటాయింపుకు మార్చి 4 సాయింత్రం 4 గంటల వరకు ఆసక్తి ఉన్న కళాశాలలోని ప్రిన్సిపాల్ ను నేరుగా సంప్రదించాల్సి ఉంటుందన్నారు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www.knruhs.telangana.gov.in ను చూడవలసిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.