టీఎస్ ఈసెట్-2023 షెడ్యూల్ విడుదల

టీఎస్ ఈసెట్-2023 షెడ్యూల్ విడుదల

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఈసెట్-2023 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1న టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈసెట్ షెడ్యూల్ ను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ డి.రవిందర్, ఈసెట్ కన్వీనర్ శ్రీరాం వెంకటేష్ కలిసి విడుదల చేశారు. మార్చి 2 నుంచి మే 5 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.

రూ. 500 ఆలస్య రుసుముతో మే 8 వరకు, రూ. 2500తో మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులను మే 8 నుంచి మే 12 వరకు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 15 నుంచి అభ్యర్థులు సంబంధిత వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 20న ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. తదితర వివరాల కోసం https://tsecet.nic.in/ అనే వెబ్ సైట్ ను సందర్శించొచ్చు.