చిన్నారులను మింగిన చెరువు..ఒకరు గల్లంతు

చిన్నారులను మింగిన చెరువు..ఒకరు గల్లంతు

వరంగల్ టైమ్స్, బీమారం: వరంగల్ లో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని బీమారంలో గల పుట్టలమ్మ రిజర్వాయర్ లో ముగ్గురు బాలురు గల్లంతయ్యారు. సంఘటన వివరాలు తెలియాగానే స్థానిక కేయూసీ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే పిల్లలు గల్లంతు కావడంలో స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లని దింపి గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలోపే జరగరాని ఘోరం జరగిపోయింది. ఆ ఇద్దరి చిన్నారులను చెరువు మింగేసింది. చెరువు నుంచి గజ ఈతగాళ్లు ఇద్దరు చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. ఇదంతా చెరువు గట్టుపై నుంచి గమనించిన కుటుంబ సభ్యులు ఆ మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. చిన్నారులను మింగిన చెరువు..ఒకరు గల్లంతువివరాల్లోకి వెళితే బీమారానికి చెందిన దొడ్డిపాటి మనివిత్ , దొడ్డిపాటి మహేష్ బాబు, మ్యూనికుంట్ల విష్ణు తేజ ఈ ముగ్గురు బాలురు సైకిల్ పై ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు రిజర్వాయర్ లో పడి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో దొడ్డిపాటి మనివిత్, దొడ్డిపాటి మహేష్ బాబు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో బాలుడు మ్యూనికుంట్ల విష్ణు తేజ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటనతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. బిడ్డల కోసం తల్లిదండ్రుల ఏడుపులు పలువురిని కంటతడి పెట్టించాయి.
దీంతో బీమారంలో విషాదం అలుముకున్నది.