ఇంటర్ ఫలితాలు విడుదల..మేడ్చల్ టాప్

హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో గ్రేటర్‌ జిల్లాలు ప్రభంజనం సృష్టించాయి. రాష్ట్రస్థాయిలో మేడ్చల్‌ జిల్లా సత్తా చాటింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 76శాతం, 80శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా ఫస్టియర్‌లో 70శాతం, సెకండియర్‌లో 76శాతంతో రెండోస్థానంలో నిలిచింది. హైదరాబాద్‌ జిల్లా సైతం మెరుగైన ఫలితాలు సాధించింది. ఫస్టియర్‌లో 61 శాతంతో రాష్ట్రస్థాయిలో 7వ స్థానం, సెకండియర్‌లో 69శాతంతో 6వ స్థానంలో నిలిచింది. మొత్తంగా బాలురతో పోల్చితే బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారు.