నిహారిక కాబోయే భ‌ర్త ఇతనే

హైదరాబాద్‌: త‌న‌కి కాబోయే భ‌ర్త విష‌యంలో దాగుడుమూత‌లాడిన మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక తన ఫియాన్సీని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇంట్ర‌డ్యూస్‌ చేసింది. చైత‌న్య‌తో ఎంతో చ‌నువుగా ఉన్న ఫోటోల‌ని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఫోటలో

నిహారిక కాబోయే భ‌ర్త ఇతనే

వీరిద్ద‌రిని చూసి అభిమానులే కాదు సెల‌బ్రిటీలు కూడా మేడ్ ఫర్ ఈచ్ అద‌ర్ అని కామెంట్స్ పెడుతున్నారు. జొన్నలగడ్డ చైతన్య.. నాగబాబు మిత్రుడైన గుంటూరు జిల్లాకు చెందిన ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్‌గా చైత‌న్య ప‌ని చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ వేడుక‌ల‌లోను ఈయ‌న పాల్గొన్న‌ట్టు సమాచారం. ఆగ‌స్ట్‌లో వీరిద్ద‌రి నిశ్చితార్ధం జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, వివాహం ఏడాది చివ‌ర‌లో జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు. ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం’ వంటి చిత్రాల్లోనూ నటించారు. అశోక్‌ సెల్వన్‌ హీరోగా నటించనున్న తమిళ చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నారు నిహారిక.