సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకున్నది. తెలుగు చిత్రసీమ తొలితరం నటులు ఒక్కొక్కరిగా దూరమవుతున్నారు. రెండ్రోజుల క్రితం విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతిచెందగా, నేడు సీనియర్ యాక్టర్ చలపతిరావు (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చలపతిరావు ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. చలపతిరావుకు కుమారుడు రవిబాబు, కుమార్తెలు మాలినిదేవి, శ్రీదేవి ఉన్నారు.