ఆగస్టు 20న కాంగ్రెస్ నూతన అధ్యక్షుడి ఎన్నిక 

ఆగస్టు 20న కాంగ్రెస్ నూతన అధ్యక్షుడి ఎన్నిక

వరంగల్ టైమ్స్, ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ తిరిగి బాధ్యతలు చేపట్టాలని ఆ పార్టీ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ ) సమావేశం నిర్ణయించింది. ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానించింది. ఆగస్టు 20న కాంగ్రెస్ నూతన అధ్యక్షుడి ఎన్నిక ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో జీ-23 నాయకుల డిమాండ్ మేరకు ఆదివారం సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షత వహించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ మినహా సీడబ్ల్యూసీ సభ్యులు, ఆహ్వానితులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగాలని కూడా ఈ సమావేశం తీర్మానించినట్లు తెలుస్తుంది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో చింతన్ బౌఠక్ నిర్వహించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. జీ-23 గ్రూప్ నేతల నుంచి పార్టీని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని, కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలని డిమాండ్లు వచ్చాయి. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ తమ పదవులకు రాజీనామా చేస్తారని వార్తలొచ్చినా, కాంగ్రెస్ పార్టీ వర్గాలు తోసిపుచ్చాయి. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వంటి వారు రాహుల్ గాంధీ తిరిగి పార్టీ అధ్యక్షత బాధ్యతలు చేపట్టాలని డిమాండ్ చేశారు.