సీజేఐ ఎన్వీ రమణను కలిసిన అల్లోల దివ్యారెడ్డి
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్ఆర్ నగర్ లోని ఆయన నివాసంలో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను కలిసి క్లిమామ్ గోశాల ఉత్పత్తులను అందజేశారు. దేశీ జాతి ఆవులను సంరక్షించాలనే లక్ష్యంతో క్లిమోమ్ వెల్నెస్ అండ్ ఫార్మ్స్‌ని 2015 లో ప్రారంభించామని తెలిపారు.తెలుగు రాష్ట్రల్లోని ప్రజలకు ముఖ్యంగా చిన్నపిల్లలకు స్వచ్చమైన ఏ2 మిల్క్ ను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ గోశాలను ప్రారంభించినట్లు వెల్లడించారు. జన్యుసంపద. స్థానిక పరిస్థితుల్ని తట్టుకుంటూ, ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండి, తక్కువ ఖర్చుతో పోషించగలిగే, దేశీయ జాతి ఆవులు సేంద్రియు వ్యవసాయానికి వెన్నుముకలాంటివని అన్నారు.
దేశీయ పశుసంపద కనుమరుగైపోకుండా, వాటిని పరిరక్షించి, భవిష్యత్తు తరాలకు ఈ సంపాదనను అందించాల్సిన కర్తవ్యంతో పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యంగా, పుష్టిగా ఉండే దేశ వాళీ ఆవులనే సంకర జాతి ఆవుల సంతతి కోసం విస్తృ తంగా ఉపయోగిస్తున్నారని, క్రాస్ బ్రీడింగ్ విధానాల వల్ల దేశీ జాతి ఆవుల ఉనికి ప్రమాదంలో పడిందన్నారు. ఇలాంటి పద్ధతులకు ఆపాలని, పవిత్రమైన ఆవును జాతీయ సంపద గుర్తించడానికి తాము చేస్తున్న ప్రయత్నానికి మద్దతు ఇవ్వాలని సీజేను అభ్యర్థించారు.