మంత్రి కేటీఆర్ ని క‌లిసిన కూడా చైర్మ‌న్ సుంద‌ర్ రాజ్ 

మంత్రి కేటీఆర్ ని క‌లిసిన కూడా చైర్మ‌న్ సుంద‌ర్ రాజ్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ని కూడా చైర్మ‌న్‌ సంగంరెడ్డి సుంద‌ర్ రాజు యాద‌వ్ మర్యాదపూర్వకంగా క‌లిశారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, రాష్ట్ర ప్ర‌భుత్వ చీఫ్ విప్‌, ఎమ్మెల్యే దాస్యం విన‌య్ భాస్క‌ర్, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ఎమ్మెల్యేలు ఆరూరి ర‌మేష్, పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి, న‌న్న‌పునేని న‌రేంద‌ర్, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, రైతు స‌మ‌న్వ‌య స‌మితి చైర్మ‌న్, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి , ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డి, రైతు రుణ‌విమోచ‌న స‌మితి చైర్మ‌న్ నాగుర్ల వెంకటేశ్వ‌ర్లు, తెలంగాణ రాష్ట్ర విక‌లాంగుల స‌హ‌కార సంస్థ చైర్మ‌న్ వాసుదేవ రెడ్డి స‌మ‌క్షంలో నూతనంగా నియమితులైన కూడా చైర్మ‌న్ సుందర్ రాజు యాదవ్ మంత్రి కేటీఆర్ ని ప్ర‌త్యేకంగా క‌లిశారు.మంత్రి కేటీఆర్ ని క‌లిసిన కూడా చైర్మ‌న్ సుంద‌ర్ రాజ్ అనంత‌రం మంత్రి కేటీఆర్కి పూల మొక్క‌ను, శ్రీ‌కృష్ణుడి విగ్ర‌హాన్ని అందించి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. హైద‌రాబాద్ న‌గ‌రం త‌ర్వాత అత్యంత వేగంగా వ‌రంగ‌ల్ న‌గ‌రం అభివృద్ధి చెందుతోంద‌ని, త‌మ ప్ర‌భుత్వం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు ప్ర‌భుత్వం అధిక‌ ప్రాధాన్య‌త‌ను ఇస్తోంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. న‌గ‌రానికి ఇప్ప‌టికే ప‌లు ఐటీ, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయ‌ని, త్వ‌ర‌లో మ‌రిన్ని రానున్నాయ‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో కుడా చైర్మ‌న్‌గా న‌గ‌రాన్ని మ‌రింత‌ అభివృద్ధిప‌థంలో ముందుకు తీసుకెళ్లాల‌ని సూచించారు. అనంత‌రం కూడా చైర్మన్ ను కేటీఆర్ ప్ర‌త్యేకంగా అభినందించారు.