ప్రతీ మొక్కను సంరక్షించాలి: దాస్యం

వరంగల్ అర్బన్ జిల్లా: స్థానిక నాయకులు, అధికారులు ఒక్కొక్క మొక్కనాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరో విడత హరితహారం కార్యక్రమంలో ప్రతీ మొక్కను సంరక్షించాలి: దాస్యంభాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్ అర్బన్ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలోని 30వ డివిజన్ లో పర్యటించారు. 30వ డివిజన్ కార్పోరేటర్ బోడ డిన్న ఆధ్వర్యంలో కాకతీయ కాలనీలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాలని అధికారులకు, స్థానిక నాయకులకు ఆయన సూచించారు. అదేవిధంగా 30వ డివిజన్ లో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణంకు భూమి పూజ చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు దాస్యం వినయ్ భాస్కర్ శంకుస్థాపన చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎం.పి పసునూరి దయాకర్ , జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పమెలా సత్పతి, స్థానిక కార్పొరేటర్ బోడ డిన్నా, హార్టికల్చర్ ఆఫీసర్ సునీత, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.