తెలంగాణలో మరో 1087 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా మరో 1087 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలోనే 888 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య ఇప్పటి వరకు 13,436కు చేరుకుంది. ఈ రోజు కరోనా బారిన పడి ఆరుగురు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారికి బలైనా వారి సంఖ్య 243కు చేరుకుంది. ఈ రోజు కరోనా నుంచి కోలుకుని 162 మంది బాధితులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 4,928 మంది బాధితులు చికిత్స అనంతరం కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.