న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి

న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : న్యూజిలాండ్ చేతిలో భారత మహిళా జట్టుకు మరోసారి ఓటమి తప్పలేదు. గత రికార్డులను కొనసాగిస్తూ న్యూజిలాండ్ మహిళా జట్టు భారత్ మీద అద్భుత విజయం సాధించింది. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్ కప్-2022లో భాగంగా న్యూజిలాండ్ లోని సెడాన్ పార్కు వేదికగా జరిగిన మ్యాచ్ లో 62 రన్స్ తేడాతో గెలుపొందింది. దీంతో ఇప్పటికే బంగ్లాదేశ్ పై విజయంతో జోరు మీదున్న వైట్ ఫెర్న్స్ సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం నాటి మ్యాచ్ లో టాస్ గెలిచిన మిథాలీ సేన, తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు శుభారంభం లభించకపోయినా, అమీలియా కెర్ అర్ధ శతకంతో చెలరేగడంతో ఇన్నింగ్స్ గాడిన పడింది.న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమిఆ తర్వాత అమీ సాటర్త్ వైట్ 75 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. వీరికి తోడు వికెట్ కీపర్ బ్యాటర్ కేటే మార్టిన్ కూడా 41 రన్స్ సాధించింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి వైట్ ఫెర్న్స్ 260 రన్స్ చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన మిథాలీ రాజ్ బృందానికి వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. హర్మన్ ప్రీత్ కౌర్ 71 రన్స్, కెప్టెన్ మిథాలీ రాజ్ 31 పరుగులు తప్ప ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. దీంతో భారత్ కు ఓటమి తప్పలేదు.