పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ క్లీన్ స్వీప్ 

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ క్లీన్ స్వీప్

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : పంజాబ్ లో ఆప్ విజయ ఢంకా మోగించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ నాలుగింట మూడొంతుల మెజార్టీతో విజయం సాధించింది. ప్రధాన పార్టీలన్నింటినీ వెనక్కి నెట్టి విజయం వైపు దూసుకెళ్లింది. సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల కమిషన్ అందించిన వివరాల ప్రకారం , ఆప్ పంజాబ్ లో 89 సీట్లు గెలుచుకుంది.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ క్లీన్ స్వీప్ 

మరో 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. పంజాబ్ లో 117 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాయి. ఇదే సమయంలో పంజాబ్ లో నిన్నమొన్నటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 15 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఎస్ఏడీబీఎస్పీ కంబైన్డ్ పార్టీ కేవలం 4 సీట్లను మాత్రమే సొంతం చేసుకుంది. ఇక ఇండిపెండెంట్లు మరో 2 చోట్ల గెలుపొందారు.