విజయ్ కొత్త సినిమా టైం షురూ.!

విజయ్ కొత్త సినిమా టైం షురూ.!

వరంగల్ టైమ్స్ సినిమా డెస్క్ : డైరెక్టర్ శివ నిర్వాణతో కలిసి టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయనున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. గ్రీన్ సిగ్నల్ పడుతుందా లేదా అనే అనుమానాలు మొదలైన ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఫిలింనగర్ లో తాజాగా చక్కర్లు కొడుతోంది.విజయ్ కొత్త సినిమా టైం షురూ.!

 

విజయ్ దేవరకొండ ఇతర కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండటంతో ఈ సినిమా ఇప్పట్లో లేనట్టేనని వార్తలు రాగా.. శివ నిర్వాణ మాత్రం 2021 జనవరిలో సెట్స్ పైకి వెళ్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం టక్ జగదీష్ చిత్రంతో బిజీగా వున్నా శివ నిర్వాణ, డిసెంబర్ చివరికల్లా షూటింగ్ పూర్తి చేస్తే..విజయ్ సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని త్వరలోనే హీరోయిన్ ఎవరనేది కూడా చెప్పనున్నాడట శివ నిర్వాణ.