అగ్రి, విద్యాశాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

అగ్రి, విద్యాశాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల జాతర కొనసాగుతుంది. తాజాగా మరో రెండు శాఖల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసింది. వ్యవసాయశాఖలో వ్యవసాయ అధికారి 148 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 100 మల్టీజోన్-1 పోస్టులు, మల్టీజోన్-2 లో 48 పోస్టులను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. 2023 సంవత్సరం జనవరి 10 నుంచి అదే నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెల్పింది.అగ్రి, విద్యాశాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ఇక విద్యాశాఖలో 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. సాంకేతిక విద్యాశాఖలో37, ఇంటర్మీడియట్ విద్యాశాఖలో 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. 2023 జనవరి 6 నుంచి అదే నెల 27 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెల్పింది. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సున్న వారు అర్హులని పేర్కొంది. పూర్తి వివరాలు వెబ్ సైట్ tspsc.gov.in లో సంప్రదించాలని సూచించింది.