కరోనా బారిన కర్ణాటక సీఎం

కరోనా బారిన కర్ణాటక సీఎంహైదరాబాద్ : కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైకి కరోనా సోకింది. ఈ మేరకు సీఎం బసవరాజు బొమ్మై అధికారికంగా తన ట్విట్టర్ ఖాతా వేదికగా ప్రకటించారు. తాను కరోనా పాజిటివ్ గా పరీక్షించబడ్డానని బసవరాజు తన ట్వీట్ లో పేర్కొన్నారు. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్ లో ఉన్నానని వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకుని, హోం ఐసోలేషన్ లో ఉండాలని సీఎం బసవరాజు బొమ్మై విజ్ఞప్తి చేశారు.