లాక్ డౌన్ తో సరిహద్దులు మూసివేత

లాక్ డౌన్ తో సరిహద్దులు మూసివేతహైదరాబాద్ : సంపూర్ణ లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రం నలువైపులా వున్న అన్ని రాష్ట్రాల సరిహద్దుల్ని మూసివేశారు. అటు ఏపీ, ఇటు కర్ణాటక, మరోవైపు కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల సరిహద్దుల్ని మూసివేశారు. దీంతో ఈ ప్రాంతాల నుంచి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే అత్యవసర సేవల కోసం వచ్చేవాటిని మాత్రం అధికారులు అనుమతించారు.

కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌ నుంచి, అదే విధంగా తేని జిల్లా నుంచి కుమిలిమీదుగా కేరళ వెళ్లే సరిహద్దులు, తిరువళ్లూరు జిల్లా ఆరంబాక్కం నుంచి ఆంధ్రప్రదేశ్‌ వెళ్లే సరిహద్దు, కృష్ణగిరి జిల్లా హోసూరు నుంచి వెళ్లే కర్ణాటక సరిహద్దును మూసివేసిన పోలీసులు ఆయా ప్రాంతా ల్లో భారీగా మోహరించారు. తేని జిల్లాలో కుమిలి, కంబం ప్రాంతాల్లో వున్న చెక్‌పోస్టుల్లో నిఘా తీవ్రం చేశారు. కంబం, గూడలూరు తదితర ప్రాంతాల్లో వున్న దుకాణాలన్నీ మూతబడ్డాయి.