యాక్సిడెంట్ లో సీరియల్ నటి కూతురు మృతి

యాక్సిడెంట్ లో సీరియల్ నటి కూతురు మృతిబెంగుళూరు : కన్నడ బుల్లితెర నటి అమృతనాయుడు కుమార్తె సమన్వి గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. టీవీ రియాలిటీ షో నాన్నమ్మ సూపర్ స్టార్ లో చైల్డ్ కంటెస్టెంట్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది సమన్వి. బెంగుళూరుకు చెందిన అమృతనాయుడు తన కుమార్తె సమన్వి గురువారం షాపింక్ కి వెళ్లారు. సాయంత్రం షాపింగ్ ముగించుకుని స్కూటీపై ఇంటికి బయల్దేరారు. నగరంలోని కొనంకుంటే క్రాస్ వద్ద వారి స్కూటీని టిప్పర్ లారీ ఢీకొట్టింది. రోడ్డుపై పడిపోయిన సమన్వి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఇక తీవ్రంగా గాయపడిన అమృతనాయుడును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్ లో టిప్పర్ డ్రైవర్ పై కేసు నమోదు అయింది. డ్రైవర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సినీ ప్రముఖులు, సమన్వి ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్లు చేస్తున్నారు.