ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పై హైకోర్టు విచారణ 

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పై హైకోర్టు విచారణ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై టీఎస్ హైకోర్టులో కీలక వాదనలు జరిగాయి. సీఎం కేసీఆర్ రిలీజ్ చేసిన వీడియోలపై పిటిషనర్లు అభ్యంతరం తెలిపారు. ఫాంహౌజ్ ఎపిసోడ్ వీడియోలు, ఆడియోలు దర్యాప్తు దశలోనే లీక్ అవ్వడంపై పిటిషనర్లు అభ‌్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ బయటపెట్టిన ఫుటేజ్ ను పిటిషనర్ కోర్టుకు సమర్పించారు.ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పై హైకోర్టు విచారణ హై ప్రొఫైల్ కేసులో దర్యాప్తు మధ్యలోనే ఆధారాలు ఎలా బయటకు వెళ్లాయని పిటిషనర్లు పేర్కొన్నారు. ఏసీబీతో ఎందుకు విచారణ జరిపించలేదని పిటిషనర్లు అన్నారు. సెక్షన్ 17 (b)ప్రకారం మెట్రోపాలిటన్ ఏసీపీ స్థాయి అధికారి పీసీ యాక్ట్ కేసులను విచారించవచ్చని అడ్వకేట్ జనరల్ తెల్పారు. 2003లో ఏసీబీ పరిధిని నియమిస్తూ జీఓ జారీ చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు.

2003 నుంచి నమోదైన పీసీ యాక్ట్ కేసులన్నీ ఏసీబీనే విచారించాలని జీఓ ఉందని పిటిషనర్ గుర్తు చేశారు. సిట్ దర్యాప్తు సక్రమంగా లేదని కోర్టుకు పిటిషనర్లు విన్నవించారు. అన్ని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని, శుక్రవారం తుది వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది.