ఐటీ ఉద్యోగులకు గ్రేటర్ ఆర్టీసీ గుడ్ న్యూస్

ఐటీ ఉద్యోగులకు గ్రేటర్ ఆర్టీసీ గుడ్ న్యూస్

ఐటీ ఉద్యోగులకు గ్రేటర్ ఆర్టీసీ గుడ్ న్యూస్వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : గ్రేటర్ ఆర్టీసీ జోన్ ఆధ్వర్యంలో మరో కొత్త మార్గంలో మెట్రో ఎక్స్ ప్రెస్ సిటీ బస్సులను నడిపించాలని జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ.యాదగిరి వెల్లడించారు. అందులో భాగంగానే మేడ్చల్ నుంచి కోకాపేట వరకు మెట్రో ఎక్స్ ప్రెస్ సిటీ బస్సులను నడిపించనున్నట్లు అధికారులు చెప్పారు. మేడ్చల్ నుంచి వయా సుచిత్ర/డీపీఎల్ కాలనీ, బాలానగర్, కూకట్ పల్లి, శిల్పారామం, గచ్చిబౌలి మీదుగా కోకాపేట్ చేరుకుంటుంది.

డిసెంబర్ 16 నుంచి ఈ కొత్త సర్వీసు నగర ప్రయాణికులకు ముఖ్యంగా ఐటీ, ఐటీ అనుబంధ ఉద్యోగుల కోసం నడుపుతున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రకటించారు. ప్రతీరోజు ఉదయం మేడ్చల్ నుంచి 8 గంటలకు మెట్రో ఎక్స్ ప్రెస్ బయల్దేరుతుందన్నారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు కోకాపేట్ నుంచి బయల్దేరుతుందని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు