ఆ మీటింగ్ కి బస్సులో వెళ్లిన దాస్యం అభినవ్

ఆ మీటింగ్ కి బస్సులో వెళ్లిన దాస్యం అభినవ్

ఆ మీటింగ్ కి బస్సులో వెళ్లిన దాస్యం అభినవ్వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్ జీడబ్ల్యూఎంసీలో నేడు 2022-2023 సంవత్సరానికి గాను బడ్జెట్ అంచనాలపై సర్వసభ్య సమావేశం జరుగనుంది. ఈ సర్వసభ్య సమావేశానికి జీడబ్ల్యూఎంసీ పరిధిలోని కార్పొరేటర్లు, తదితర అధికారులు తమ తమ వాహనాల్లో వెళ్లారు. అయితే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభివన్ భాస్కర్ మాత్రం రూట్ చేంజ్ చేశాడు. ఆర్టీసీ బస్సులో జీడబ్ల్యూఎంసీ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యాడు.అదాలత్ సర్కిల్ నుండి ఎంజీఎం చౌరస్తా వరకు బస్సులో ప్రయాణించి కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు.

కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ తో పాటు పలువురు యువకులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా దాస్యం అభినవ్ భాస్కర్ ఓ మెసేజ్ చేశాడు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమైనదని తెలిపాడు. అంతేకాకుండా ఆర్టీసీ బలోపేతానికి తమ వంతు పాత్రను పోషించాలని కోరారు. అయితే ఆర్టీసీ బస్సులో వెళ్తున్న దాస్యం అభినవ్ భాస్కర్ ను చూసిన స్థానిక ప్రజలు మాత్రం ఆశ్చర్యపోయారు, ఆపై ఆయనను అభినందించారు.