కేఎంసీ పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కేఎంసీ పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కేఎంసీ పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నంవరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : కేఎంసీ పీజీ అనస్తీషియా వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మరో పీజీ వైద్యుని వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ప్రీతి తండ్రి నరేందర్ రైల్వే ఎస్సై. వీరిది హైదరాబాద్. అయితే గత రెండ్రోజుల క్రితం సీనియర్ డాక్టర్లు ప్రీతిని వేధించగా, ఆమె కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాసుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

దీంతో ప్రిన్సిపల్ వారిని మందలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున వరంగల్ ఎంజీఎంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన తోటి వైద్య విద్యార్థులు ఆమెకు చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ కు తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.