సైఫ్ రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది ?
వరంగల్ టైమ్స్, క్రైం డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మెడికో ప్రీతి ఆత్మహత్య చివరికి విషాదాంతమైంది. ప్రాణాలతో పోరాడి ఓడింది. 5 రోజుల నరక యాతన తర్వాత ప్రాణాలు వదిలింది. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న సైఫ్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సైఫ్ ఫోన్ లో నుండి 17 వాట్సాప్ చాట్స్ పోలీసులు పరిశీలించారు. తదనంతరం అనుషా, భార్గవి, LDD+Knockouts వాట్స్ అప్ గ్రూప్ చాట్స్ స్వాధీనం చేసుకున్నారు.అనస్థీషియా డిపార్ట్మెంట్ లో ప్రీతి ని సూపర్ వైజ్ చేస్తున్న సీనియర్ గా సైఫ్ ఉన్నాడు. ఐతే రెండు ఘటనల ఆధారంగా ప్రీతిపై సైఫ్ కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ లో ఒక యాక్సిడెంట్ కేస్ విషయంలో ప్రీతిని గైడ్ చేసిన సైఫ్, ఆ ఘటనలో ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్ట్ రాసింది ప్రీతి. అయితే ప్రీతి రాసిన రిపోర్టును వాట్సాప్ గ్రూప్ లో పెట్టి హేళన చేశాడు సైఫ్. రిజర్వేషన్ లో ఫ్రీ సీటు వచ్చిందంటూ ప్రీతిని అవమానించాడు సైఫ్. తనతో ఏమైనా ప్రాబ్లమా అంటూ సైఫ్ ను ప్రశ్నించింది ప్రీతి. దీంతో ఏమైనా సమస్య ఉంటే హెచ్ఓడీకి చెప్పాలని సైఫ్ కు ప్రీతి వార్నింగ్ ఇచ్చింది.
ఈ క్రమంలో తన స్నేహితుడు భార్గవ్ కు ప్రీతిని వేధించాలని సైఫ్ చెప్పాడు. RICU లో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని సైఫ్ చెప్పాడు. ఇలా చేయడంతో గత నెల 21న హెచ్ఓడీ నాగార్జునకి ప్రీతి ఫిర్యాదు చేసింది. డాక్టర్లు మురళి, ప్రియదర్శిని , శ్రీకల సమక్షంలో ప్రీతికి, సైఫ్ కి కౌన్సిలింగ్ ఇచ్చారు వైద్యులు. మరుసటి రోజే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది.