కేటీఆర్ వరంగల్ పర్యటన సభా స్థలం మార్పు

కేటీఆర్ వరంగల్ పర్యటన సభా స్థలం మార్పు

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : హైదరాబాద్ తరువాత వరంగల్ నగరం పై సీఎం ప్రత్యేక శ్రద్ద పెట్టి అభివృద్ధి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అందులో భాగంగా ఈ నెల 20న రాష్ట్ర మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటనలో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని పేర్కొన్నారు. అభివృద్ధిపై జిల్లా అధికారులు సంబంధిత శాఖల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు. సభ కోసం రెండుమూడు స్థలాలు చూడడం జరిగిందన్నారు. అందులో భాగంగానే హన్మకొండలోని హయగ్రీవ చారి (కూడా ) గ్రౌండ్లో ఏర్పాటు చేసినట్లు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.కేటీఆర్ వరంగల్ పర్యటన సభా స్థలం మార్పుఈ నెల 20న సాయంత్రం 4గంటలకు సభ నిర్వహించడం జరుగుతుందని వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. దేశంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ అని చెప్పారు. సభా స్థలం మార్పులో భాగంగా హయగ్రీవాచారి గ్రౌండ్ లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు పరకాల, నర్సంపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చల్లా ధర్మరెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపునేని నరేందర్, కూడా చైర్మన్ సుందర్ రాజు తదితరులు పర్యటించారు. సభా స్థలాన్ని పర్యవేక్షించారు.కేటీఆర్ వరంగల్ పర్యటన సభా స్థలం మార్పు