ప్రీ వెడ్డింగ్ షూట్ లో విషాదం
వరంగల్ టైమ్స్, రంగారెడ్డి జిల్లా : ప్రీ వెడ్డింగ్ షూట్ ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఏడడుగుల బంధాన్ని మధుర జ్ఞపకాలుగా మిగిల్చుకునేందుకు ఆ కాబోయే జంట చేపట్టిన ప్రీ వెడ్డింగ్ వారి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఈ విషాదకర ఘటన వారి జీవితాల్లో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడ గ్రామంలో ప్రీ వెడ్డింగ్ షూట్‌లో విషాదం నెలకొంది. ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్న సమయంలో షూట్ ఎఫెక్టివగా ఉండటం కోసం పొగ పెటడంతో పెళ్లికొడుకు,పెళ్లికూతురుపై తేనెటీగలు దాడి చేశాయి. కాగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులు హైదరాబాద్‌లోని మాలక్‌పేట యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మరో రెండు రోజుల్లో పెండ్లి బాజా భజంత్రీలతో సందడిగా మారాల్సిన ఆ ఇండ్లలో ఇప్పుడు ఇలా జరగడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.