షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ఎంట్రీలకు ఆర్టీసీ ఆహ్వానం

షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ఎంట్రీలకు ఆర్టీసీ ఆహ్వానం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఆర్టీసీ సేవలను ప్రజలకు సులువుగా అవగాహన కల్పించేందుకు, ప్రజారవాణా ప్రాముఖ్యతను ప్రతీ ప్రతీ ఒక్కరికి తెలిపిందుకు తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమానికి నడుంబిగించింది. అలాంటి వారికోసం షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ను ఆర్టీసీ నిర్వహిస్తోంది. సున్నితమైన ఆర్టీసీ ప్రయాణం, లీటర్ పెట్రోల్ ధర కన్నా తక్కువగా రూ. 100కే రోజంతా హైదరాబాద్ సిటీ బస్సులో ప్రయాణం, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బుక్ చేసుకుంటే ఇంటికే ఆర్టీసీ బస్ , కార్గో సేవలు, గరుడ, రాజధాని బస్సుల్లో సౌకర్యాలు, తదితర అంశాలపై ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండే షార్ట్ ఫిలింలను తీసి మాకు పంపించండి.షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ఎంట్రీలకు ఆర్టీసీ ఆహ్వానంఆర్టీసీ మీకు ఆకర్షణీయమైన బహుమతులను అందచేస్తుంది. ఈ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో మొదటి బహుమతి రూ. 10 వేలు, రెండో బహుమతి రూ. 5 వేలు, మూడో బహుమతి రూ. 2500 అందచేయబడుతుంది. 10 కన్సోలేషన్ బహుమతులు కూడా ఉంటాయి. ఆర్టీసీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో పాల్గొనాలనుకుంటే మీ పూర్తి వివరాలను 2022, ఏప్రిల్ 21 లోగా [email protected] పంపించాలని టీఎస్ఆర్టీసీ పేర్కొంది.

note:ఈ కింద పేర్కొన్న ఏదో ఒక అంశంపైనే షార్ట్ ఫిలింలు తీయాల్సి ఉంటుంది. వ్యవధి : 120 seconds/2mins

1. సురక్షితమైన ఆర్టీసీ ప్రయాణం
2. ఆర్టీసీ కార్గో సేవలు
3. గరుడ, రాజధాని బస్సుల్లో సౌకర్యాలు
4. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బుక్ చేసుకుంటే ఇంటికే ఆర్టీసీ బస్
5. లీటర్ పెట్రోల్ ధర కన్నా తక్కువకే రూ. 100కి రోజంతా హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణం