రైతుల పిల్లల చదువు కోసం భజ్జీ రాజ్యసభ జీతం 

రైతుల పిల్లల చదువు కోసం భజ్జీ రాజ్యసభ జీతం

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇటీవల రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఐతే నేడు టర్బనేటర్ హర్భజన్ ఓ కీలక ప్రకటన చేశారు. రాజ్యసభ సభ్యులకు వచ్చే జీతాన్ని రైతుల కుమార్తెల విద్య, సంక్షేమం కోసం ఉపయోగించనున్నట్లు హర్భజన్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.రైతుల పిల్లల చదువు కోసం భజ్జీ రాజ్యసభ జీతం ఈ దేశాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. దేశం కోసం ఏదైనా చేస్తానని తన ట్వీట్ లో భజ్జీ తెలిపారు. ఇటీవల పంజాబ్ నుంచి రాజ్యసభకు ఐదుగురు సభ్యులు ఎన్నికయ్యారు. ఐతే క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు భజ్జీ చెప్పిన విషయం తెలిసిందే.