ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 

ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా

వరంగల్ టైమ్స్ , స్పోర్ట్స్ డెస్క్ : వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు ఆస్ట్రేలియా ఉమెన్స్ టీం దూసుకెళ్లింది. రికార్డు స్థాయిలో ఏడోసారి వరల్డ్ కప్ నెగ్గేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. వర్షం అంతరాయం మధ్య బుధవారం జరిగిన తొలి సెమీస్ లో ఆసీస్ 157 రన్స్ తేడాతో వెస్టిండీస్ పై ఘన విజయం సాధించింది. మొదల అలీస్సా హిలీ ( 107 బంతుల్లో 129, 17 ఫోర్లు, సిక్స్ ) సూపర్ సెంచరీకి తోడు రాచెల్ హేన్స్ ( 85) రాణింపుతో ఆసీస్ 45 ఓవర్లలో 305/ 3 భారీ స్కోరు నమోదు చేసింది.ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా అనంతరం భారీ టార్గెట్ ఛేజింగ్ లో విండీస్ 37 ఓవర్లలో 148 రన్స్ కే కుప్పకూలింది. కెప్టెన్ స్టెఫానీ టేలర్ ( 48) టాప్ స్కోరర్. ఆసీస్ బౌలర్లలో జొనాసెస్ (2/ 14) రెండు వికెట్లు పడగొట్టింది. హీలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. గురువారం జరిగే రెండో సెమీస్ లో ఇంగ్లండ్ , సౌతాఫ్రికాతో పోటీ పడుతుంది. ఈమ్యాచ్ లో నెగ్గిన జట్టు ఆదివారం ఆసీస్ తో ఫైనల్ ఆడుతుంది.