భారత్ పై ఆసీస్ ఘనవిజయం
హైదరాబాద్: టెస్ట్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ సంపాదించి ఘోర పరాజయం అయిన టీం ఇండియాపై ఆస్ట్రేలియా సునాయాస విజయాన్ని నమోదు చేసింది. నాలుగు టెస్టుల సిరీస్ లో ఆతిథ‌్య1-0 ఆధిక్యం సాధించింది. 90 రన్స్ టార్గెట్ తో ఈ రోజు రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియన్ క్రికెటర్లు.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకున్నారు. 21 ఓవర్లలో 93 రన్స్ చేశారు. ఓపెనర్ జో బర్న్స్ హాఫ్ సెంచరీతో నాటౌట్ గా నిలిచాడు. అంతకుముందు మూడవ రోజు తొలి సెషన్ లో ఆసీస్ బౌలర్లు తమ సత్తా చాటుకున్నారు.శరవేగంగా బంతులు వేస్తూ , భారత బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టారు. ఆసీస్ బౌలర్ట ధాటికి టీం ఇండియా తన రెండవ ఇన్నింగ్స్ లో కేవలం 36 రన్స్ కే ఆల్ అవుట్ అయింది. హేజల్ వుడ్ 5 వికెట్లు తీయగా, కమ్మిన్స్ నాలుగు వికెట్లు తీశాడు. షమీ రిటైర్డ్ హార్ట్ అయ్యాడు. స్వల్ప లక్ష్యంతో చేజింగ్ దిగిన ఆస్ట్రేలియా అతి సునాయాసంగా టార్గెటక్ ను అందుకున్నది. 8 వికెట్ల తేడాతో మ్యాచ్ ను సొంతం చేసుకున్నది. ఆసీస్ రెండవ ఇన్నింగ్స్ లో మాథ్యూ వేడ్ 33, వేడ్ 51 రన్స్ చేశారు.