నర్సింగ్, ఎంఎల్టీ, బీపీటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ 

నర్సింగ్, ఎంఎల్టీ, బీపీటీ ప్రవేశాలకు నోటిఫికేషన్

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : కన్వీనర్ కోటా బీఎస్సీ నర్సింగ్ , పోస్ట్ బేసిక్ నర్సింగ్, బీఎస్సీ ఎంల్ టి, బీపీటీ ప్రవేశాలకు వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ను కాళోజి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు విడుదల చేసింది. ఈ నెల 5వ తేదీ ఉదయం 8 గంటల నుండి 6వ తేదీ రాత్రి 7 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.

యూనివర్సిటీ ఇప్పటికే విడుదల చేసిన మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ప్రాధాన్యతాక్రమంలో కళాశాల, కోర్సు వారీగా ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉంటుంది. సీట్ల ఖాళీల వివరాలను వెబ్ సైట్లో పొందుపర్చారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ https://tsparamed.tsche.in/, www.knruhs.telangana.gov.inలో చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.