జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవీ కాలం పొడిగింపు 

జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవీ కాలం పొడిగింపు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి. ప్రకాశ్ పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకాశ్ కొనసాగుతారని తెలిపింది. ఈ మేరకు ప్రకాశ్ పదవీకాలం పొడిగిస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేండ్గుగా సంస్థ చైర్మన్ గా ప్రకాశ్ కొనసాగుతున్నారు. 2017 లో జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ప్రకాశ్ నియామకం అయ్యారు.జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవీ కాలం పొడిగింపు