వరంగల్ లో క్వింటాల్ పత్తి ధర ఎంతంటే ? 

వరంగల్ లో క్వింటాల్ పత్తి ధర ఎంతంటే ?

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : పత్తికి డిమాండ్ ఏర్పడుతుండటంతో శుక్రవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ ధర ఏకంగా రూ. 11,170 చేరువైంది. ఇప్పటి వరకు ఈ మార్కెట్ లో పత్తికి అత్యధిక ధర ఇదేనని మార్కెట్ వర్గాలు తెలిపాయి.వరంగల్ లో క్వింటాల్ పత్తి ధర ఎంతంటే ? దేశంలోనే పంటల ఉత్పత్తిలో మన రాష్ట్రం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇక్కడ సమ శీతోష్ణ పరిస్థితులు ఉండటంతో అన్ని రకాల పంటలు పండుతాయి. నిన్నటి వరకు మిర్చి పంట ధరల్లో పసిడితో పరుగులు పెడుతుండగా, ఇప్పుడు పత్తికి కూడా డిమాండ్ ఏర్పడుతుండటంతో అన్నదాతలు సంతోషిస్తున్నారు.