ఎనుమాముల మార్కెట్ లో ఎల్లో కలర్ మిర్చి

ఎనుమాముల మార్కెట్ లో ఎల్లో కలర్ మిర్చి

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు బుధవారం పసుపు రంగులో ఉన్న మిర్చి వచ్చింది. మార్కెట్ చరిత్రలోనే మొదటిసారిగా ఈ రంగు మిర్చి వచ్చినట్లు అధికారులు తెలిపారు. జనగామ జిల్లా తరిగొప్పుల గ్రామానికి చెందిన బుస్సా కుమారస్వామి 14 బస్తాల ఎల్లో కలర్ మిర్చిని తీసుకువచ్చాడు. కృష్ణ కమర్షియల్ కార్పొరేషన్ అడ్తి ద్వారా కరీదు వ్యాపారి క్వింటాల్ కు రూ. 40 వేలు ధర పలుకగా, రైతు తన మిర్చిని క్వింటాల్ కు రూ.50 వేలకు ఇస్తానని చెప్పడంతో వ్యాపారి వెనుదిరిగి పోయాడు.ఎనుమాముల మార్కెట్ లో ఎల్లో కలర్ మిర్చివెంటనే రైతు మార్కెట్ కు తీసుకువచ్చిన మిర్చి బస్తాలను కోల్డ్ స్టోరేజీలో భద్రపరిచినట్లు తెలిపారు. మార్కెట్ లోని మిర్చి యార్డుకు కొత్త రకం మిర్చి వచ్చినట్లు ప్రచారం కావడంతో కార్మికులు పెద్ద ఎత్తున వచ్చి నాదరి ఎల్లో రకం మిర్చిని తిలకించారు.