తెల్ల బంగారానికి రెక్కలు..ఎక్కడో తెలుసా ?

తెల్ల బంగారానికి రెక్కలు..ఎక్కడో తెలుసా ?

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి ధర రూ. 10,235 ధర పలికింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం జఫర్ గడ్ గ్రామానికి చెందిన రైతు 17 బస్తాల పత్తిని మార్కెట్ కు తెచ్చాడు. దీనికి ఖరీదుదారులు గరిష్ట ధర రూ. 10, 235 నిర్ణయించారు. చేలలో పత్తి లేకపోవడం ,అంతర్జాతీయంగా బేళ్ల ఎగుమతి పెరగడం, పత్తి గింజల ధర పెరగడంతో పత్తి రేటు పెరిగిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.తెల్ల బంగారానికి రెక్కలు..ఎక్కడో తెలుసా ?

రానున్న రోజుల్లో ఇంకా కొంత స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సంవత్సరం అధిక వర్షాలు చీడ పీడల తో దిగుబడి మూడు నాలుగు క్వింటాళ్ల కే పరిమితమైందని దీంతో ఈ సంవత్సరం దిగుబడి పూర్తిగా తగ్గడంతో మార్కెట్లో మంచి డిమాండ్ నడుస్తోందని రైతులు పత్తిని ఆరబెట్టి తీసుకు వస్తే నాణ్యమైన ధర లభించే అవకాశం ఉంటుందని అన్నారు. మార్కెట్ లో ఇప్పటివరకు పత్తికి ఇదే అత్యధిక ధర అని మార్కెట్ వర్గాలు తెలిపాయి.