ఆనంద్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

ఆనంద్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : హీరో ఆనంద్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ‘బేబీ’ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా ‘బేబీ’. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మంగళవారం ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.ఆనంద్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ఈ పోస్టర్ ఎలా ఉందో చూస్తే…వాడిన రోజా పువ్వును హీరో ఆనంద్ దేవరకొండ పట్టుకుని తీక్షణంగా చూస్తున్నారు. రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఆమె స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఓల్డ్ రోజ్ ఫ్లవర్ వెనక దాగి ఉన్న కథేంటి అనేది సినిమాలో చూడాలి. ఈ పోస్టర్ తో ఆనంద్ కు టీమ్ మెంబర్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. న్యూ ఏజ్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న ‘బేబీ’మూవీ ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది.

నిర్మాత : ఎస్. కే. ఎన్
నిర్మాణ సంస్థ : మాస్ మూవీ మేకర్స్
రచన, దర్శకత్వం : సాయి రాజేష్
సినిమాటోగ్రఫీ : బాల్ రెడ్డి
సంగీతం : విజయ్ బుల్గానిన్
ఎడిటింగ్ : ఎం.ఆర్ వర్మ
ఆర్ట్ : సురేష్
సహా నిర్మాత : ధీరజ్ మోగిలినేని
ఎగ్జిక్యూటివ్ నిర్మాత : దాసరి వెంకట సతీష్
చీఫ్ సహాయ దర్శకుడు : మహేష్ అలంశెట్టి
పీఆర్వో : ఏలూరు శీను & జి. ఎస్. కే మీడియా
కొరియోగ్రఫీ :పొలాకి విజయ్.