మంటల్లో కీవ్ బిల్డింగ్ లు

మంటల్లో కీవ్ బిల్డింగ్ లు

వరంగల్ టైమ్స్, కీవ్ : ఉక్రెయిన్ పై రష్యా దాడులు తారాస్థాయికి చేరుకున్నాయి. నేడు ఉదయం తెల్లవారుజామున భీకర ఫైరింగ్ జరిపింది. కీవ్ మిస్సైళ్ల వర్షం కురిపించింది. జనావాసాలను టార్గెట్ చేశారు. కీవ్ లోని పలు ప్రాంతాల్లో ఉన్న బిల్డింగ్ లు ఆ దాడికి ధ్వంసం అయ్యాయి. సతోసిన్ స్కీ జిల్లాలో 9 అంతస్తుల బిల్డింగ్ మంటల్లో చిక్కుకున్నది. దానికి సంబంధించిన ఫోటోలు రిలీజ్ చేశారు.మంటల్లో కీవ్ బిల్డింగ్ లుఈ ఘటనలో ఎవరైనా మృతి చెందారా అన్న విషయాన్ని ఇంకా తెలుపలేదు. మరో టార్గెట్ లో మెట్రో స్టేషన్ ధ్వంసమైంది. లుకియానిస్కా మెట్రో స్టేషన్ ను పేల్చేశారు. కీవ్ సెంటర్ కు సమీపంలో ఈ స్టేషన్ ఉంటుంది. డ్యామేజ్ కావడం వల్ల ఆ స్టేషన్ ను మూసివేశారు.

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం నేటితో 20 రోజులకు చేరుకున్నది. నేడు ఉదయం ఉక్రెయిన్ సైనిక దళాల చీఫ్ కొంత సమాచారం అందచేశారు. రష్యాకు చెందిన నాలుగు హెలికాప్టర్లు, ఓ విమానంతో పాటు క్రూయిజ్ మిస్సైల్ ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యా దళాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నట్లు ఉక్రెయిన్ చెప్పింది. క్షిపణులు, బాంబులతో కీలక మౌళికసదుపాయాలపై రష్యా దాడులు చేస్తూనే ఉంది.