ఘనంగా సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలు

ఘనంగా సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలు

ఘనంగా సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలువరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ సీఎం 69వ జన్మదినానోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంతో పాటు, దేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్థిల్లాలని కోరుతూ కేసీఆర్ అభిమానులు, పార్టీ నేతలు, శ్రేణులు, పలువురు ప్రముఖులు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాదిగా సీఎం కేసీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా ఫోన్లో మాట్లాడి సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ కు ప్రధాని మోడి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు.

కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, రావు సాహెబ్ పాటిల్ దన్వే, శ్రీపాద్ ఎశో నాయక్ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి, అస్సాం సీఎం హిమంత విశ్వశర్మ లు శుబాకాంక్షలు తెలిపారు. మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ కేంద్ర మంత్రి సినియాక్టర్ చిరంజీవి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, హైద్రాబాద్ లో భారత డిప్యుటీ హై కమిషనర్ గారెత్ విన్ వోయెన్, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, సినీ హీరో మహేశ్ బాబు, తదితర ప్రముఖులు సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జనతా కాంగ్రెస్ చత్తీస్ గఢ్ ప్రెసిడెంట్ అమిత్ అజిత్ జోగి, లోకమత్ మీడియా సంస్థ చైర్మన్ విజయ్ దర్దా తదితరులు సీఎం కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా..
లండన్ లో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. బీఆర్ఎస్ నాయకులు సతీష్ రెడ్డి, దూసరి అశోక్ గౌడ్, రత్నాకర్, అబు జాఫర్, షణ్ముగ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిని వేడుకలో 150 మందికి పైగా హాజరయ్యారు. యుఎస్ ఎ లో హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో, బహ్రెయిన్ లో సతీష్ కుమార్ ఆధ్వర్యంలో, జర్మనీలో అరవింద్ బాబు, రాజీవ్ ఆధ్వర్యంలో, ఖతర్ లో శ్రీధర్ ఆధ్వర్యంలో, న్యూజిలాండ్ లో జగన్, విజయ్ ఆధ్వర్యంలో, సౌతాఫ్రికాలో గుర్రాల నాగరాజు ఆధ్వర్యంలో, డెన్మార్క్ లో శ్యామ్ ఆకుల ఆధర్యంలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

ఢిల్లీ, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్ సహా జాతీయ స్థాయిలో సంబురాలు :
బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, సీఎం జన్మదిన వేడుకలు ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఢిల్లీ బీఆర్ఎస్ జాతీయ కార్యాలయంలో పలువురు నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబురాలు జరిపారు. ఒడిశా రాష్ట్రంలో బీఆర్ఎస్ శ్రేణులు అధినేత పుట్టిన రోజును ఘనంగా జరిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ లో సిఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.

ఆంద్ర ప్రదేశ్ లో..
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో అధినేత పుట్టిన రోజు సంబురాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిపారు. బెజవాడ దుర్గామాతగుడిలో సీఎం కేసీఆర్ క్షేమాన్ని కాంక్షిస్తూ పూజలు నిర్వహించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యనేత రావెల కిశోర్ బాబు పలు చోట్ల రక్తదాన శిబిరాలను నిర్వహించారు. అన్నదానం, పండ్లు ఫలాల పంపిణీ కార్యక్రమాలను చేపట్టారు.

హైద్రాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, సీఎంవో అధికారులు సిబ్బంది తదితరులు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

కేసీఆర్ జన్మదిన వేడుకలు ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఢిల్లీ బీఆర్ఎస్ జాతీయ కార్యాలయంలో పలువురు నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబురాలు జరిపారు. ఒడిశా రాష్ట్రంలో బీఆర్ఎస్ శ్రేణులు అధినేత పుట్టిన రోజును ఘనంగా జరిపారు.

హైదరాబాద్ లో..
మంత్రి తలసాని ఆధ్వర్యంలో : రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో కేసీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. పీవీ మార్గ్ లోని థ్రిల్ టీలో భారీ ఎత్తున నిర్వహించిన వేడుకల్లో సీఎం కేసీఆర్ 69 వ పుట్టిన రోజు కేక్ కట్ చేశారు. 10 వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ కె.కేశవరావు, మంత్రి గంగుల కమలాకర్,ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, పలువురు చైర్మన్లు, తదితర నేతలు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

అదే సందర్భంలో మంత్రి తలసాని ఆధ్వర్యంలో సీఎంకి శుభం జరగాలని, ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద, బల్కంపేట ఎల్లమ్మ, మహాంకాళి టెంపుల్, నాంపల్లి దర్గా, సికింద్రాబాద్, అబిడ్స్ లోని వెస్లీ చర్చి, గౌలీగూడా, అమీర్ పేట్ లోని గురుద్వారాల్లో, చిక్కడ పల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రార్థనలు నిర్వహించారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ధర్మపురిలో 69 మహాగని మొక్కలు నాటారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో గడికోట లో కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా జరిగాయి. గిరిజన మహిళలు విద్యార్థుల నడుమ సంబురాలు జరుపుకున్నారు.

తెలంగాణ భవన్ లో ..
బిఆర్ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్ లో ఘనంగా జరిగాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. కార్యకర్తలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపినాథ్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, కార్యాలయ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కట్టెల శ్రీనివాస్ యాదవ్, తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా సిఎం కేసీఆర్ గారి పుట్టిన రోజు సంబురాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్ లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మొక్కలు నాటారు.

జిల్లాల వ్యాప్తంగా ఘనంగా వేడుకలు :
ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కీసర టెంపుల్ లో అభిషేకం, అర్చన చేశారు. కీసర అర్బన్ ఎకో పార్క్ లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం లో మంత్రి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి లతో కలిసి ఎంపీ జోగిన పల్లి సంతోష్ కుమార్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు.

మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండలో 700 మందితో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం లో స్వయంగా మంత్రి పాల్గొన్నారు. అంతకు ముందు, సూర్యాపేటలో 70 కేజీల కేక్ ను కట్ చేసి ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఐసీయూ యూనిట్ తో కూడిన అంబులెన్స్ ను సూర్యాపేట ఏరియా దవాఖానాకు అందించారు. దివ్యాంగులకు త్రీవీలర్స్ ను అందించారు. చారిత్రాత్మక పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం లో మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కలు నాటారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో జనగామ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. పాలకుర్తిలో పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. దేవరుప్పలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

మంత్రి మల్లారెడ్డి ఆధర్యంలో కీసర గుట్ట ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత ఆధర్వంలో బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ లో ప్రత్యేక పూజలు జరిగాయి.

ప్రగతి భవన్ లో కేసీఆర్ బర్త్ డే వేడుకలు..
ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సంబురాలను కార్యాలయ సిబ్బంది ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సీఎంకి బర్త్ డే విషెస్ తెలిపారు. మిఠాయిలు పంచుకున్నారు. సిఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో కలకాలం వర్ధిల్లాలని ప్రార్థించారు. ఈ సంబురాల్లో సీఎం కేసీఆర్ పీఎస్ వెంకట నారాయణ, సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు, పీఆర్వో రమేష్ హజారీ,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.