9 జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలు :ఎస్ఈసీ

9 జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలు :ఎస్ఈసీ

9 జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలు :ఎస్ఈసీ

వరంగల్ టైమ్స్, హైద‌రాబాద్ : టీచ‌ర్ ఎమ్మెల్సీ ఓట‌ర్ల న‌మోదు ప్ర‌క్రియ పూర్తైన‌ట్లు ఎస్ఈసీ వికాస్ రాజ్ పేర్కొన్నారు. హైద‌రాబాద్ –రంగారెడ్డి –మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో ఓట‌ర్ల న‌మోదు పూర్తైంద‌ని తెలిపారు. 2022, డిసెంబ‌ర్ 31 నాటికి 3 జిల్లాల్లో ఓట‌ర్ల సంఖ్య 29,501. కాగా కొత్త‌గా 1,131 ఓటు హ‌క్కు ద‌రఖాస్తులు వ‌చ్చాయ‌ని చెప్పారు. ఆ ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి ఈ నెల 23న తుది జాబితా ప్ర‌క‌టిస్తామ‌న్నారు. గ‌తంలో తిర‌స్క‌రించిన 1,440 ద‌ర‌ఖాస్తుల్లో 788 స‌రైన‌వే అని స్ప‌ష్టం చేశారు.

పోలింగ్ కేంద్రాల ప్ర‌తిపాద‌న‌ల‌ను ఈసీకి పంపుతామ‌ని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్‌తో 9 జిల్లాల్లో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింద‌న్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు నోటా, వ్య‌య ప‌రిమితి నిబంధ‌న లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఎన్నిక‌కు సంబంధించి ఈ నెల 16వ తేదీ నోట‌ఫికేష‌న్‌ను విడుద‌ల కానుంది. ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల‌కు అవ‌కాశం క‌ల్పించారు. మార్చి 13న ఎన్నిక‌ల పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. 16న ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు.