రేవంత్ , షర్మిలకు మంత్రి ఎర్రబెల్లి చురకలు

రేవంత్ , షర్మిలకు మంత్రి ఎర్రబెల్లి చురకలు

రేవంత్ , షర్మిలకు మంత్రి ఎర్రబెల్లి చురకలు

వరంగల్ టైమ్స్, జనగామ జిల్లా : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిల కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చురకలంటించారు. పాలకుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా రేవంత్, షర్మిల లు తనపై చేస్తున్న ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. తనపై చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని మంత్రి దయాకర్ రావు అన్నారు. నిరూపించలేకపోతే పదవులకు రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకోవాలని మంత్రి దయాకర్ రావు వారిద్దరికి సవాల్ విసిరారు.

జనగామలో ఎమ్మెల్యేలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి దయాకర్ రావు రేవంత్, షర్మిల పై మండిపడ్డారు. ఉద్యమాల్లో ముఖం చూపించని వారు, ప్రజల పక్షాన పోరాటాలు చేయడం సిగ్గుచేటుగా ఉందని ఎద్దేవా చేశారు. పాదయాత్రలు చేస్తూ ప్రజాస్వామ్యం పరువు తీస్తూ, రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారని మంత్రి ఆరోపించారు.

తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ఏం చేశాడో తెలపాలని డిమాండ్ చేశారు. ఆయన రాజకీయమంతా కుట్రలు, కుతంత్రాలతో నిండుకుని ఉందని విమర్శించారు. చంద్రబాబుకు ఏజెంట్ గా వ్యవహరిస్తూ ఓటుకు నోటు కేసులో జైలు కెళ్లాడని మంత్రి విమర్శించారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తూ జైలుకు వెళ్లిన ఘనత తనదని మంత్రి తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు 15 సీట్లు రాగా ప్రస్తుతం రేవంత్ ఆధ్వర్యంలో 5 సీట్లు గెలవడం గగనమేనని ఎద్దేవా చేశారు.

ఇక రేవంత్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ సర్వనాశనమేనని మంత్రి విమర్శించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని షర్మిలకు మంత్రి హెచ్చరించారు. ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడక పోతే తెలంగాణ ఎడారి అయ్యేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే దేవాదుల ప్రాజెక్ట్ అన్యాయానికి గురైంది దయాకర్ రావు గుర్తు చేశారు.

సీఎం కేసీఆర్ వచ్చాకే దేవాదుల ప్రాజెక్టుకు మహర్దశ వచ్చిందన్నారు. రూ. వంద కోట్లు అదనంగా ఖర్చు పెట్టి ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

errabeli dayakarrao hot comments on revanthreddy and ys sharmila