ప్రభుత్వ ఉద్యోగులు ఫోన్లు మాట్లాడితే ఇక చర్యలు

ప్రభుత్వ ఉద్యోగులు ఫోన్లు మాట్లాడితే ఇక చర్యలు

వరంగల్ టైమ్స్, చెన్నై : మద్రాస్ హైకోర్టు నేడు ఓ పిటిషన్ పై కీలక తీర్పును వెలువరించింది. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసు వేళల్లో తమ వ్యక్తిగత విషయాల కోసం మొబైల్ ఫోన్ వాడరాదని కోర్టు తన తీర్పులో చెప్పింది. మద్రాస్ హైకోర్టు జస్టిస్ ఎస్ఎం సుబ్రమణియం ఈ తీర్పును వెలువరించారు. ఈ నేపథ్యంలో ఆయన తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ దిశగా నియమావళిని రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ రూల్స్ ను పాటించని ఉద్యోగులపైన చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు తన ఆదేశాల్లో వెల్లడించింది.ప్రభుత్వ ఉద్యోగులు ఫోన్లు మాట్లాడితే ఇక చర్యలు