సీఎం కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి థాంక్స్

సీఎం కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి థాంక్స్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని 9 జిల్లాల్లో గర్భిణీ స్త్రీలలో, బాలింతలలో రక్తహీనత సమస్య ఎక్కువ ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

సీఎం కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి థాంక్స్ఈ లోపాన్ని నివారించేందుకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్ అనే పేరుతో పోషకాహారంతో కూడిన కిట్లను వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఈ కిట్స్ ద్వారా ప్రతీ సంవత్సరం లక్షా ఇరవై వేలమంది మహిళలు ప్రయోజనం పొందనున్నారని ఆయన తెలిపారు. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.